సుడోకు రూపకర్త కన్నుమూత

18 Aug, 2021 02:03 IST|Sakshi

టోక్యో: అంకెలతో ఆసక్తి పుట్టించే సుడోకు రూపకర్త మాకి కాజీ కన్నుమూశారు. బైల్‌ డక్ట్‌ కేన్సర్‌తో బాధపడుతూ 69 ఏళ్ల వయసులో మరణించారని ఆయన స్థాపించిన నికోలి కో. సంస్థకు చెందిన ఉద్యోగులు వెల్లడించారు. 2004 నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

జపనీయులు సుడోకును స్థానికంగా సుజి–వా–డోకుషిన్‌–ని–కగిరు అని పిలుస్తారు. దాన్ని షార్ట్‌కట్‌లో సుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకి కాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్‌ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకు చాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది.  

మరిన్ని వార్తలు