వైరల్‌: ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు

5 Apr, 2021 12:20 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న మలేషియా సెక్యూరిటీ గార్డ్‌ లంచ్‌ మెను (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న స్టోరి

కౌలలాంపూర్‌: నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని స్థితిలో బతుకీడుస్తున్నారు అనేది అక్షర సత్యం. ఓ వైపు కొందరు తినలేక ఆహారాన్ని వృధా చేస్తుంటే.. మరి కొందరు చాలినంత తిండిలేక ఆకలితో కృశించి మరణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం నిజంగా సిగ్గు చేటు. ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి తాజాగా ఫేస్‌బుక్‌లో వైరలవుతోంది. దీని చూసిన వారంతా పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మలేషియాకు చెందిన అపిత్‌ లిడ్‌ అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్‌ డ్రెస్‌ ధరించిన ఓ వ్యక్తి లంచ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అతడి బాక్స్‌లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. 

కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు అపిత్‌ లిడ్‌. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్‌ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్‌.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: వైరల్‌: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్‌ బ్యాగ్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు