ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు

20 Jan, 2021 13:50 IST|Sakshi

పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతం మాల్దీవులు. 26 ద్వీపాల సముహమైన మాల్దీవ్స్‌లో సహజమైన బీచ్‌లు, చల్లటి వాతావరణంతో స్వర్గాన్ని తలపిస్తుంది. అంతేగాక ఇక్కడ ప్రతి ఐలాండ్‌లోని రిసార్టులు స్వీమ్మింగ్‌ ఫూల్స్‌తో, బెడ్‌రూం విల్లాలు మాల్దీవులకు మరింత ఆకర్షణ. అయితే ఇక్కడ విడిది చేయాలంటే పర్యాటకులు ఒక్కరోజుకు వేల రూపాయల నుంచి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణ ప్రజలతో పోలిస్తే సెలబ్రెటీలే ఎక్కువగా ఇక్కడకు వెళుతుంటారు. లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలల పాటు సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సెలబ్రెటీలంతా రిఫ్రెష్‌మెంట్‌ కోసం మాల్దీవులకు క్యూ కడుతున్నారు. దీంతో పర్యటకులను మరింత ఆకట్టుకునేందుకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషిలో కొత్తగా ఓ ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించారు. ప్రస్తుతం ఈ రిసార్టు‌ పర్యాటకులు తెగ ఆకట్టుకుంటోంది. అయితే దీని ఖరీదు విని మాత్రం చాలా మంది నోళ్లు వెల్లబెడుతున్నారు. 32,000 చదరపు మీటర్ల అభయారణ్య ద్వీపమైన మాల్దీవులలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ ద్వీపం. లగ్జరీ రూమ్‌లతో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో నిర్మించిన ఈ రిసార్టులో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు 58 లక్షల రూపాయలు చెల్లించాలంట. (చదవండి: చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం)

అంత ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్‌ విల్లాలతో కూడిన లగ్జరీ బెడ్‌రూమ్‌లు, రెండు ఓవర్‌ వాటర్‌ బెడ్‌రూమ్‌లు, రెసిడెన్సీ బెడ్‌రూంలతో పాటు స్వీమ్మింగ్‌ ఫూల్స్‌ ఉన్నాయి. వినోదం కోసం ఒక ప్రైవేట్  క్లబ్‌హౌస్‌ కూడా ఉంది. అదే విధంగా స్వంత ప్రత్యేక పాక బృందం, వాటర్‌స్పోర్ట్స్, డైవింగ్, యాచ్ ట్రిప్స్, ధ్యానం, యోగా సెంటర్లు, పిల్లలకు ప్రత్యేకంగా స్వీమ్మింగ్‌ పూల్, గేమింగ్ ఏరియాతో పాటు పూర్తిస్థాయి జిమ్ కూడా ఉంది. ఇథాఫుషి - ప్రైవేట్ ద్వీపంలో నిర్మించిన లగ్జరీ కొత్త రిసార్టును ఈ వారంలోనే ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 24 మంది పర్యటకులు విడిది చేయవచ్చు. ఈ ద్వీపానికి వెళ్లాలంటే పడవలో 40 నిమిషాల్లో లేదా విమానంలో 15 నిమిషాల్లో ద్వీపానికి చేరుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ద్వీపానికి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా. మరి అక్కడ ఉండాలంటే ఒక్క రాత్రికి 58,49,600 రూపాయలు (80,000 అమెరికా డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు