అమ్మాయిల హెన్‌ పార్టీ గ్రూపు.. అతడేం చేశాడంటే..

20 Feb, 2021 16:05 IST|Sakshi
టేలర్‌ లోవరీ

మీరెప్పుడైనా మీకు తెలియకుండా.. మీకు సంబంధం లేని వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేయబడ్డారా?. ఒక వేళ అలా అయితే ఏం చేస్తారు? వెంటనే ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్‌ అవుతారు. మీరు ఓ అబ్బాయయుండి.. అమ్మాయిల బ్యాచిలర్‌ పార్టీ గ్రూపులో యాడ్‌ చేయబడితే? ఏం చేసేవారో ఆలోచిస్తున్నారా?.. మీరేమో కానీ, టేలర్‌ అనే వ్యక్తి  చేసిన పని ప్రస్తుతం అతన్ని సోషల్‌ మీడియా సెలెబ్రిటీని చేసింది.

వివరాలు.. టేలర్‌ లోవరీ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం పొరపాటున ఉమెన్స్‌ బ్యాచిలర్‌ పార్టీ గ్రూపులో యాడ్‌ చేయబడ్డాడు. ఆ గ్రూపులో ఓ అమ్మాయి పెళ్లికి సంబంధించిన బ్యాచిలర్‌ పార్టీ గురించి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు ఎవరో తనను ఎందుకు గ్రూపులో యాడ్‌ చేశారో తెలియక టేలర్‌ తికమకబడ్డాడు. ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్‌ అవుదామనుకున్నాడు. కానీ, అంతకంటే ముందు తానెవరో ఆ గ్రూపు వారికి తెలియజేయాలని భావించాడు. ఇందుకోసం ఓ వీడియో తీసి గ్రూపులో పెట్టాడు. ‘‘ లేడీస్‌! నా పేరు టేలర్‌ లోవెరీ. నన్ను కెల్లర్‌ బ్యాచిలర్‌ పార్టీకి పిలిచినందుకు సంతోషం. కెల్లర్‌కు శుభాకాంక్షలు. నేను లేడీస్‌ నైట్‌ పార్టీలో పాల్గొనటానికి విగ్‌ కొనుక్కోలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ( పాపం లిగాన్‌.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..)

నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీరనుకుంటున్న టేలర్‌(అమ్మాయి)ని కాదు. కాబట్టి మీరామెకు ఫోన్‌ చేసి సరైన అడ్రస్‌ కనుక్కోవటం మంచిది. బహుశా తనకు ఈ బ్యాచిలర్‌ పార్టీ గురించి తెలిసుండకపోవచ్చు. బ్యాచిలర్‌ పార్టీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరో సారి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నాడు. టేలర్‌ పంపిన వీడియోను గ్రూపులోని ఓ అమ్మాయి తన టిక్‌టాక్‌ ఖాతా ద్వారా షేర్‌ చేసింది. దీంతో వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు