మాస్కు పెట్టుకోమన్నందుకు చాతి కొరికాడు

28 Jul, 2020 19:50 IST|Sakshi

డబ్లిన్ : కరోనా నేపథ్యంలో ఇప్పుడు మాస్క్‌ అనివార్యంగా మారింది. ఎవరైనా సరే బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్‌ ధరించాలంటూ ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ఇంతచెప్పినా కొందరు మాత్రం లెక్కచేయడంలేదు. చాలా మంది ఏదో మొక్కుబడిగా మాస్కును ధరిస్తున్నారే తప్ప నిజంగా తమ రక్షణకే అన్న విషయం మరిచిపోయారు. అయితే మాస్క్‌ ధరించమని చెప్పినందుకు ఎన్నోసార్లు భౌతిక దాడులతో పాటు వ్యక్తుల ప్రాణం కూడా తీసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా మాస్క్‌ పెట్టుకోమని సూచించిన వ్యక్తిని కొరికి బస్సులో నుంచి పారిపోయిన ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.(మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష)

వివరాలు.. బెల్జియంలో నివసించే రాబర్ట్‌ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తుండగా, వెనుకనున్న వ్యక్తి అదే పనిగా ముక్కు చీదాడు. అయితే మర్ఫీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాస్కును ధరించాలని కోరాడు. అవతలి వ్యక్తి క్షమాపణ కోరుతూ మాస్కు ధరించాడు. కొద్దిసేపటికి అదే బస్సులోకి ఒక జంట ఎక్కింది. ఆ జంట వచ్చి మర్ఫీ ఎదుట కూర్చున్నారు. వారిలో యువకుడు మాస్క్‌ సరిగా ధరించకపోవడంతో మాస్క్‌ సరిగా పెట్టుకోవాలని మర్ఫీ సూచించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సదరు వ్యక్తి అకస్మాత్తుగా మర్ఫీపై దాడికి దిగాడు. మర్ఫీ చాతిపై తన పళ్లతో గట్టిగా కొరికి ప్రేయసితో కలిసి బస్సు దిగి పారిపోయాడు. వెంటనే మర్పీని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ జంటను గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు