25 లాట‌రీలు గెలుపొందిన ల‌క్కీ ప‌ర్స‌న్‌..

6 Aug, 2020 20:54 IST|Sakshi

వ‌ర్జీనియా: ఒక్క‌సారి లాట‌రీ త‌గిలితే ఏమంటారు? అదృష్టం అంటే నీదే అని! మ‌రి రెండు సార్లు లాట‌రీ గెలుస్తే? మ‌హా అదృష్ట‌మంటారు.. పోనీ మూడు, నాలుగోసారి కూడా గెలిస్తే.. అదృష్టానికి నిలువెత్తు రూపం, అదృష్ట దేవ‌త నీ ఇంట్లో తిష్ట వేసిందంటూ పొగ‌డ్త‌లు కురిపిస్తారు. కానీ ఇక్క‌డో వ్య‌క్తి మాత్రం మాట‌ల్లో చెప్ప‌లేనంత ల‌క్కీ ప‌ర్స‌న్‌. అవును, అత‌ను ఏకంగా 25 లాట‌రీలు గెలుపొందాడు. ల‌క్ ల‌క్క‌లా అతుక్కున్న ఈ వ్య‌క్తి పేరు రేమండ్ హారింగ్‌ట‌న్‌. ఈయ‌న‌ అమెరికాలోని వ‌ర్జీనియా ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు. ఓ రోజు స‌ర‌దాగా బీచ్‌కు వెళ్ల‌గా అక్క‌డి వేగ్న‌మ్ దుకాణంలో 25 డాల‌ర్లు వెచ్చించి 25 లాట‌రీ టికెట్లు కొనుగోలు చేశాడు. (ఉద్యోగం ఊడింది, భారీ లాట‌రీ త‌గిలింది)

తీరా ఏమాత్రం లెక్క త‌ప్ప‌కుండా అత‌ను కొనుగోలు చేసిన 25 టికెట్లు అన్నీ కూడా లాట‌రీను గెలుచుకున్నాయి. ప్ర‌తి టికెట్‌కు 5 వేల డాల‌ర్లు బ‌హుమానంగా వ‌స్తాయి. ఈ లెక్క‌న అత‌ను మొత్తంగా 1,25,000 డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు 93 ల‌క్షల 81 వేల రూపాయ‌లు) గెలుచుకున్నాడు. దీంతో తొలుత అవాక్క‌యిన అత‌ను త‌ర్వాత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ డ‌బ్బును త‌న కొడుకుల‌ విద్య‌కు ఖ‌ర్చు పెడ‌తాన‌ని, త‌ద్వారా వారికి మంచి భ‌విష్య‌త్తును అందించేందుకు ఉప‌యోగిస్తానంటున్నాడు. (వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ)

మరిన్ని వార్తలు