వైరల్‌ వీడియో.. స్మూత్‌గా తప్పించాడు

18 Sep, 2020 10:53 IST|Sakshi

కాన్‌బెర్రా‌: సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు ఆదేశాలు జారీ చేయగలం. ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటాం కాబట్టి మనం కమ్‌, సిట్‌, గో అంటూ ఆదేశాలు జారీ చేస్తే.. చెప్పినట్లు వింటాయి. కానీ ఇదే ఆదేశాలను మొసలికి జారీ చేయగలరా.. అది కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఆస్ట్రేలియాకు చెందిన రాంగ్లర్‌ మాట్‌ రైట్‌ మాత్రం ఇలాంటి పనులను చాలా అలవోకగా చేయగలడు. ఆ వీడియోలను మనకు చూపించగలడు. రాంగ్లర్‌ 13 అడుగుల భారీ మొసలిని బుజ్జగిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు..  రైట్ ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని ఒక నది మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మొసలి అతడిని సమీపించింది. వేటడానికి రెడీగా దవడలను విశాలంగా తెరిచి రైట్‌ వైపు రాసాగింది. ఆ సమయంలో అతడు కాక అక్కడ వేరే  ఎవరు ఉన్నా ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగు తీసేవారు. (చదవండి: తాబేలుతో అంత వీజీ కాదు!)

కానీ మాట్‌ రైట్‌ మాత్రం మొసలిని సరదాగా మార్చడానికి ప్రయత్నించాడు. బోన్‌క్రంచర్‌ అనే మొసలిని కూర్చొండి.. వెళ్లండి.. ఉండండి అంటూ బుజ్జగించాడు. అలా దాన్ని మాటల్లో పెట్టి నెమ్మదిగా మొసలి ముక్కు పట్టుకుని దాన్ని స్మూత్‌గా తన మార్గం నుంచి పక్కకు తప్పిస్తాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడయో తీసిన రైట్‌ దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈవీడియోను ఇప్పటికే 1.8లక్షల మంది వీక్షించారు. ‘కుక్కపిల్లలాగే మొసలితో మాట్లాడుతున్నాడు.. సూపర్’‌ అని కొందరు కామెంట్‌ చేయగా.. మరి కొందరు మాత్రం ‘ప్రమాదకరమైన స్టంట్‌.. పర్యాటకులు దీనిని అనుకరించే ప్రమాదం ఉంది’ అంటూ విమర్శించారు. ఇక రైట్‌ ఒక న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంవత్సరాలుగా బోన్‌ క్రంచెర్‌ తెలుసు. అది చాలా ప్రశాంతమైనది. ఏళ్లుగా నాకు దానితో ఎంతో సంబంధం ఉంది. కానీ జనాలు దీన్ని ఉదాహరణగా తీసుకుని అనుకరించే ప్రయత్నం చేయకూడదు’ అన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు