లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు ...కానీ భార్య, పిల్లలకు చెప్పకుండా..

1 Nov, 2022 07:28 IST|Sakshi

ఒక వ్యక్తికి ఏకంగా రూ. 248 కోట్లు ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. కానీ ఈ విషయం తన భార్యకు పిల్లలకు చెప్పలేదట. పైగా చెబితే వారుకి ఎక్కడ అహంకారం నెత్తికెక్కి సోమరులుగా మారతారని చెప్పలేదంటున్నాడు. 

వివరాల్లోకెళ్తే...చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ. 248 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. అతను అక్టోబర్‌ 24న ఫ్రైజ్‌మనీని కలెక్ట్‌ చేసుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. అతను ఈ డబ్బును తీసుకునేటప్పుడూ కూడా కార్టూన్‌ వేషంలో వచ్చి తీసుకున్నాడు. అత్యంత గోప్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత అధికారులు సదరు వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్‌ ప్రాంతానికి లీగా గుర్తించారు.

తాను ఇంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లుతన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేదన్నాడు. ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే గాక పిల్లలు సరిగా చదువుకోవడం మానేస్తారని చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం సుమారు రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా దాదాపు రూ. 147 కోట్లు ఇంటికి తీసుకువెళ్లనున్నాడు. తాను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఈ సారి మ్రాతం ఈ నెంబర్‌కి భారీ మొత్తంలో లాటరీ తగిలిందని లీ ఆనందంగా చెప్పుకొచ్చాడు. 

(చదవండి: గులాబీ కలర్‌ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా)

మరిన్ని వార్తలు