గంటలో 58 అంతస్తుల బిల్డింగ్‌ ఎక్కాడు

7 Dec, 2020 11:36 IST|Sakshi

పారిస్‌: స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు. హీరో చేతులతోనే పెద్ద పెద్ద భవంతులను ఎక్కడం.. ట్రైన్లు వంటి వాటిని ఆపుతూ ప్రజలను కాపాడటం వంటి సాహసాలు చేస్తాడు. ఇక స్పైడర్‌ మ్యాన్‌ అంటే పిల్లల్లో ఉండే క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా టాపిక్‌ ఎందుకు వచ్చిందంటే.. ఓ యూ ట్యూబర్‌ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. అది కూడా గంట వ్యవధిలోనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రియల్‌ స్పైడర్‌ మ్యాన్‌ అంటూ నెటిజనులు సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తున్నారు. వివరాలు.. అథ్లెట్ లియో అర్బన్ శనివారం ఎలాంటి భద్రతా సామాగ్రి లేకుండా కేవలం తన చేతులతోనే పారిస్‌ మోంట్‌పార్నాస్సేలోని ఆకాశహర్య్యాన్ని ఎక్కాడు. 58 అంతస్తుల భవనాన్ని అర్బన్ ఒక గంటలోపే ఎంతో సులువుగా అధిరోహించాడు. అతడు ఈ సాహసోపేతమైన ఫీట్‌ని వేలాది మంది ప్రజలు, వీలేకరులు ప్రత్యక్షంగా చూడటమే కాక వీడియోలు కూడా తీశారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రక్‌ దూసుకెళ్లినా బతికింది)

అర్బన్ గతంలో ఈఫిల్ టవర్, టూర్‌ టీ1, అరియాన్ ఆకాశహర్మ్యాలు ఎక్కాడు. ఇక తాజాగా ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో 210 మీటర్ల (690 అడుగులు) ఎత్తైన భవనం పైకి ఎక్కిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫీట్‌ చేయడానికి ముందు తాను ఎన్నో వారాల నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నానని.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన ఫీటు ఇదేనని తెలిపాడు అర్బన్‌. 
 

మరిన్ని వార్తలు