ఆస్ట్రిచ్‌ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్‌చల్‌! ఎందుకలా చేశాడంటే...

29 Aug, 2022 20:53 IST|Sakshi

థాయిలాండ్‌లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్‌ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్‌చల్‌ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్‌ నెట్‌ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా!

వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్‌ ఎస్కేప్‌ డ్రిల్‌లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్‌ పక్షులు చాలా వైల్డ్‌గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు.

ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ అనే డ్రిల్‌ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్‌ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు.

పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్‌ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు.

(చదవండి: ఆ జర్నలిస్ట్‌ వర్క్‌ డెడికేషన్‌ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు)

మరిన్ని వార్తలు