ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!

25 Feb, 2023 19:13 IST|Sakshi

కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్‌  షెర్మాన్‌ పావెలన్స్‌ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు.

పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్‌ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై  కూల్‌ వాటర్‌ని పోశాడు. రెండు గ్లాస్‌ల వాటర్‌ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్‌ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్‌లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్‌ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు.

ఆ స్వీట్‌ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్‌ చేసేందుకు చల్లటి వాటర్‌ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న షెర్మాన్‌ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం.

(చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్‌)

మరిన్ని వార్తలు