లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!

23 Jan, 2022 20:52 IST|Sakshi

Man Says He Was Fired For Being Too Fat: ఏ కంపెనీ అయిన టాలెంట్‌ని పరిగణలోకి తీసుకునే ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటుంది. కొన్ని కంపెనీలు ఐతే ఇన్నేళ్లు అనుభవం ఉంటేనే రిక్రూట్‌ చేసుకుంటానని ముందే చెబుతున్నాయి. కానీ ఇక్కడోక వ్యక్తిని కేవలం లావుగా ఉన్నాడంటూ విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...ఆస్ట్రేలియాకు చెందిన హమీష్ గ్రిఫిన్ క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని సొంత ఇంటికి ఆఫీస్‌ సుమారు 3,200 కి.మీ దూరం. కాగా అతను ఇటీవలే ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఇల్లు కూడా మారాడు. అయితే ఉ‍న్నట్టుండి అతని కంపెనీ యజమాని  నువ్వు చాలా లావుగా ఉ‍న్నావు పనిచేయలేవు అని చెప్పి విధుల నుంచి తొలగించేశారు.

ఈ మేరకు గ్రిఫిన్ మాట్లాడుతూ..."కనీసం నా పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇ‍వ్వలేదు. కేవలం నేను లావుగా ఉ‍న్నాను కాబట్టి ఏ పనిచేయలేను అని నిర్ణయించారు. పైగా నాకు ఒక కొడుకు ఉ‍న్నాడు. ఈ ఏడాది అతని చదువు ఆగిపోతుంది." అని ఆవేదన వ్వక్తం చేశాడు. అయితే ఆరోగ్య కారణాలతో తొలగించడం వివక్షత కిందకే వస్తుందని లాయర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తన ఆస్తులను అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏదిఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పనిచేయగల సామర్థ్యం ఉన్నప్పుడూ ఒక కంపెనీ ఇలాంటి కుంటిసాకులతో ఉద్యోగం తొలగించడం అమానుషం.

(చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్‌ వైరల్‌ వీడియో!!)

మరిన్ని వార్తలు