వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా ఎంత ఇచ్చారంటే..?

25 Dec, 2022 12:00 IST|Sakshi

వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది.

ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది.

పొరపాటుతో తలకిందులు..
అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది.

దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్‌తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది.

ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును  అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది.
చదవండి: అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం

మరిన్ని వార్తలు