కూతురి బర్త్‌ డే గిఫ్ట్‌ కోసం చూస్తుంటే.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’

21 Jul, 2022 21:45 IST|Sakshi

మనుషుల భావోద్వేగాలతో ఆటాడుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. పోస్ట్‌ చేసిన 12 గంటల్లోనే ఏకంగా రెండు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఏకంగా 65 వేల మంది స్పందించారు. 

ఇంతకీ వీడియోలో ఏముందంటే .. తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి గిఫ్ట్‌ తీసుకొచ్చి కిచెన్‌లో ఉన్న తన భార్యకిస్తాడు. గిఫ్ట్‌ ప్యాక్‌లో ఓ కవర్‌ తెరిస్తే.. అందులో మరొకటి.. అది తెరిస్తే.. ఇంకొకటి.. అలా చివరికి ఓ రెండు కాగితాలు మిగులుతాయి. ఏదో గొప్ప బహుమతి ఇస్తావనుకుంటే ఇవేంటీ అని ఆమె భర్తను ప్రశ్నిస్తుంది. సరే ఈ కాగితాల్లో ఏముంది? ఆమె ప్రశ్నకు ఆ వ్యక్తి సమాధానం వింటే షాకవడం ఖాయం. ‘అవి DNA పరీక్షా ఫలితాలు.. వాటి ప్రకారం మన బిడ్డకు తండ్రి నేను కాదు’ అని అతను చెప్పగానే ఆమె నిశ్చేష్టురాలవుతుంది. 
చదవండి👉పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి .. అబార్షన్‌కు హైకోర్టు నో.. ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

ఈ వీడియోలో నిజమెంత? అబద్దమెంత? వ్యూస్‌ కోసం చేశారా? లేక నిజంగానే జరిగిందా? అన్నదానిపై పరిశీలన చేశాం. ఇది రెండేళ్ల కిందటిదిగా తేలింది. వీడియో పాతదా? కొత్తదా? అన్నది పక్కనపెడితే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. కోపతాపాలు పెరగడంతో విచ్చలవిడిగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పటికే పుట్టిన బిడ్డల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోంది. ఇక కృత్రిమ గర్భధారణతో పుట్టిన బిడ్డల విషయంలోనూ గందరగోళం నెలకొంటోందని ఎన్నో కేసులు చెబుతున్నాయి. వీటికి తోడు అనైతిక సంబంధాలు.. వెరసి ఎంతో మానసిక వ్యధను పిల్లలు ఎదుర్కొంటున్నారు.
చదవండి👉జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ

మరిన్ని వార్తలు