ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టి మొసళ్ల నదిలో దూకాడు..

15 Jul, 2021 08:55 IST|Sakshi
వీడియో దృశ్యాలు

వాషింగ్టన్‌ : ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని ఓ వ్యక్తి పిచ్చి పని చేశాడు. రోడ్డు ప్రక్కనే ఉన్న మొసళ్ల నదిలోకి దూకాడు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు.. అదృష్టం బాగుండి బయటపడ్డాడు. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. వివరాలు.. లూసియానాకు చెందిన జిమ్మి ఇవాన్‌ జెన్నింగ్స్‌ కొద్ది రోజుల క్రితం నదిపై ఉన్న వంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. 2 గంటలు గడిచినా ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. దీంతో బోర్‌ కొట్టిన జిమ్మి పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు. అయితే ఆ నదిలో ముసళ్లు ఉన్నట్లు అతడికి తెలియదు. నీళ్లలో పడ్డ తర్వాత అతడి నోటికి, ఎడమ చేతికి గాయమైంది.

ఈత కొట్టడానికి ఇబ్బంది పడసాగాడు. అలా దాదాపు గంటన్నర పాటు ఈదుతూనే ఉన్నాడు. ఈత కొట్టే ఓపిక నశించినా ప్రాణం మీద ఆశతో అంటూ ముందుకు వెళ్లాడు. చివరకు ఓ ఇసుక తిన్నెమీదకు చేరుకున్నాడు. ఆ తర్వాత నడుచుకుంటూ ఊర్లోకి అడుగుపెట్టాడు. అక్కడ పోలీసులు జిమ్మిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు జిమ్మి చేసిన పిచ్చిపనిని తప్పుబడుతున్నారు.

మరిన్ని వార్తలు