గుండె ఆగిపోయింది.. కానీ 45 నిమిషాలకు మళ్లీ..

17 Nov, 2020 16:42 IST|Sakshi

వాషింగ్టన్‌: అద్బుతమైన దృశ్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికిన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మంచు కొండ పర్యటనకు వెళ్లిన వ్యక్తి.. అక్కడి మంచులో కూరుకుపోవడంతో అతడిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ 45 నిమిషాల తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించడంతో అతడు మృత్యుంజయుడు అయ్యాడు. ఇంతకి ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాకు చెందిన మైఖేల్‌ నాపిన్క్సి. 45 ఏళ్ల వయసున్న అతడు కాలినడకన దేశ పర్యటన చేస్తుంటాడు. ఈ క్రమంలో గతవారం తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని మంచుకొండకు కాలినడకన పర్యటనకు వెళ్లాడు. నాపిన్క్సి, అతడి స్నేహితుడు చెరో దిక్కున పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు. అయితే వీరిద్దరూ తిరిగి కలుసుకునే చోటును ముందే నిర్ణయించుకున్నారు. (చదవండి: వైరల్‌: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు)

సాయంత్రమైనా నాపిన్క్సి తాము అనుకున్న చోటికి తిరిగి రాకపోవడం అతడి స్నేహితుడు సహాయక బృందానికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం హెలికాప్టర్‌తో గాలింపు చర్యల చేపట్టింది. ఈ క్రమంలో కొద్ది సమయానికి నాపిన్క్సిని గుర్తించి రక్షించిన టీం హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికి పల్స్‌ మాత్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. సీపీఆర్‌ చేసి అతడిలోని అధిక కార్బోరియల్‌ మెమ్బేన్‌ ఆక్సిజనేషన్‌(ఇసీఎంఓ) యంత్రంతో చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు జెనెల్లా బదులక్‌ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఈ ఇసీఎంఓ శరీరం నుంచి రక్తాన్ని గుండెకు పంప్‌ చేసి ​కార్భన్‌ డై ఆక్సైడ్‌ను తొలిగిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 45 నిమిషాల తర్వాత నాపిన్స్కి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. (చదవండి: రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు