3 నెలలు కార్‌లోనే ఉన్నా.. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగం సాధించా

2 Nov, 2020 14:24 IST|Sakshi

న్యూజెర్సీ: కరోనా కారణంగా దేశంలో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉండిపోవడం, మరికొందరు ఇంటికే పరిమితం కావడం వలన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక నిరుద్యోగుల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్‌, ఉద్యోగం లేకపోవడం, సంపాదన లేక అనేక మంది కరోనా కాలంలో బ్రతకడమే కష్టంగా మారింది. ఇదే కోవలోనే యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌లో ఉద్యోగం చేసే జాక్‌ జోన్స్‌ 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మెరైన్‌ కార్ప్స్‌లో మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్‌ అయిన జాక్‌.. దళాలను వదిలిపెట్టి ట్రక్‌ డ్రైవర్‌గా సొంత ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పడానికి ఎంతో కష్టడడ్డాడు. ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో అతని అదృష్టం తిరోగమనం పట్టింది. చివరకు తన కుటుంబాన్ని పోషించడం కూడా చాలా కష్టమైంది.

2020లో అతని జీవితం మరింత సవాలుగా మారింది. వెనక్కి తిరిగి చూస్తే యూఎస్‌ మెరైన్‌గా పనిచేసి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సాధారణ జీవితం గడపడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని జాక్‌ చెప్పాడు. ఇంకా అనేక విషయాలపై స్పందిసస్తూ.. 'నేను సాధారణ జీవితం గడపడానికి మానసికంగా సిద్ధంగా లేను అయినా తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో మాటలో చెప్పాలంటే సాధారణ జీవితానికి అలవాటుపడటానికి చాలా కష్టమైంది. దాదాపు మూడు నెలల పాటు కారులోనే ఉండిపోయాను. (ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...)

అప్పడుప్పడు స్నేహితుడితో కలిసి క్లాస్‌, హోటళ్లకు వెళ్లడానికి మాత్రమే అతికొద్ది సమయం బయటకు వచ్చేవాడిని. వ్యక్తిగతంగా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను' అంటూ జాక్‌ చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య సుదీర్ఘ ఇంటరర్యూ ప్రక్రియను పూర్తి చేసి.. మూడు నెలల సుదీర్ఘ కష్టం తర్వాత మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగం పొందాను. ఇప్పడు ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. నా భార్యను హే మీకు ఎలాంటి ఇల్లు కావాలి అని అడగగలుగుతున్నాను' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు