తిమింగలంతో దోస్తి

27 Feb, 2021 04:52 IST|Sakshi

వావ్‌ అనిపించే చిత్రం.. ఏదో బెస్ట్‌ ఫ్రెండ్స్‌లాగ.. వీరిద్దరి బంధం సూపర్‌ కదూ.. దీని వెనుక ఓ కథ ఉంది. 2019లో నార్వేలోని హామర్‌ఫెస్ట్‌లో శరీరంపై కెమెరా తగిలించి ఉన్న ఈ బెలూగా వేల్‌ కొంతమంది మత్స్యకారులకు కనిపించింది.. ఈ కెమెరా పరికరం మీద సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పేరు ఉండటంతో.. రష్యావాళ్లు పంపిన గూఢచారి తిమింగలం అని అప్పట్లో అనుకున్నారు.. కన్ఫర్మ్‌ కాలేదనుకోండి.. అయితే.. కెమెరా చుట్టి ఉండటంతో ఇది చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.. తిమింగలం కావడంతో దాన్ని విప్పదీయడానికి అందరూ దూరం నుంచి ట్రై చేశారు.. కానీ సాధ్యం కాలేదు.. అప్పుడు ఈ చిత్రంలోని హెస్టెన్‌ అనే వ్యక్తి ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి.. దీనికి బంధవిముక్తి కలిగించాడు. అప్పట్నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్‌ అయిపోయారు.. ఆ మధ్య కలిసినప్పుడు ఓ ఫొటోగ్రాఫర్‌ తీసిన చిత్రమిది.. అద్భుతంగా ఉంది కాబట్టి.. సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌ 2021 తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో దీనికీ చోటు దక్కింది. ఇంకో విషయం.. ఈ వేల్‌కు ఉన్న ఫ్రెండ్లీ నేచర్‌ వల్ల ఇప్పుడది లోకల్‌గా ఓ సెలబ్రిటీ అయిపోయింది. దూరప్రాంతాల నుంచి పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. 

మరిన్ని వార్తలు