కొడుకునే దోచుకునేందుకు యత్నించాడు ఓ తండ్రి..కానీ ట్విస్ట్‌ ఏంటంటే..

12 Mar, 2023 12:27 IST|Sakshi

కన్న కొడుకునే దోచుకునేందుకు యత్నించాడు ఓ తండ్రి. విచిత్రమేటంటే తాను దొంగతనం చేస్తుంది తన కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. దీంతో సదరు తండ్రికి కోర్టు 26 నెలల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకెళ్తే..స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నివశిస్తున్న17 ఏ‍ళ్ల టీనేజర్‌ ఓ రోజు తన ఇంటి సమీపంలోని ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లాడు. అతను డబ్బులు కలెక్ట్‌ చేసుకుని కార్డుని జేబులో పెట్లకుంటుండగా.. ఎరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి గోడకు బలంగా నెట్టేశారు. పైగా ఆ యువకుడిని గోడకు నొక్కెస్తూ వెనక్కు తిరగనివ్వకుండా మెడపై కత్తిపెట్టి బెదిరించాడు ఓ ఆగంతకుడు.

దీంతో సదరు యువకుడు భయంతో ఏం కావాలని అడగగా.. ముసుగు ధరించిన వ్యక్తి ఆ యువకుడి వద్ద ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయమని డిమాండ్‌ చేస్తాడు. ఐతే ఆ ఆగంతకుడి గొంతు విని తన తండ్రి అని గుర్తించి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నిదానించుకుని నేనెవరో తెలుసా అని గట్టిగా అడుగుతాడు యువకుడు. నిజంగానే నన్ను డబ్బులు అడుగుతున్నావా  అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తిని. ఐతే ఆగంతకుడు అదేమి పట్టనంటూ ఔను! అంటూ డబ్బలిస్తావా లేదా అని డిమాండ్‌ చేస్తూనే ఉంటాడు. దీంతో ఆ యువకుడు వెంటనే వెనక్కు తిరిగి అతని ముసుగు ఒక్కసారిగా లాగేసి..ఏంటిదా నాన్న! అని ఆగంతకుడి రూపంలో ఉన్న తండ్రిని గట్టిగా నిలదీశాడు.

దీంతో ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తాడు ఆ తండ్రి. వెంటనే ఆ యువకుడు ఆ ఏటీఎం మెషన్‌ వద్ద నుంచి వేగంగా బయటకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఆగంతకుడిని అరెస్టు చేయగా..నేరాన్ని అంగీకరిస్తాడు. ఈ మేరకు కోర్టులో సదరు నిందితుడు తన నేరాన్ని అంగీకరించటమే గాక తన కొడుకే ఏటీఎం వద్ద ఉన్నాడిని తనకు తెలియదని చెప్పాడు. దొంగతనం చేసేందుకే ఏటీఎంలోకి వచ్చానని అంగీకరించాడు కూడా. దీంతో కోర్టు దీన్ని ఊహించని అసాధారణమైన కేసుగా పేర్కొంటూ నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించింది. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు