బాక్స్‌ ఓపెన్‌ చేస్తే.. అనుకోని అతిథి

25 Aug, 2020 10:51 IST|Sakshi

న్యూయార్క్‌ : అప్పుడప్పుడు నకిలీ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లను ఆశ్రయించి మోసపోతుంటాం. ఒక్కోసారి ఆర్డర్‌ చేసిన వస్తువుకు బదులు రాళ్లు, ఇతర పనికిరాని వస్తువులు వచ్చాయని వార్తల్లో చూశాం. కానీ, ఓ అమెరికా వినియోగదారుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. నైక్‌ కంపెనీనుంచి వచ్చిన దుస్తుల ప్యాక్‌ను విప్పి చూడగా, పురుగులు బయటపడ్డాయి. ఒక్కసారి కంగుతిన్న అతడు దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన  బెంజమిన్ స్మితీ ఆన్‌లైన్‌లో నైక్‌ కంపెనీ బట్టలను బుక్‌ చేశాడు. డెలివరీ బాయ్‌ బాక్స్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. ఉత్సాహంగా బాక్స్‌ ఓపెన్‌ చేసిన స్మితీ ఆశ్చర్యపోయాడు. బట్టలపై పురుగులు పారుతుండడం గమనించాడు. ప్యాక్‌లోపల కూడా ప్రతి బట్టపై పురుగులున్నట్లు గుర్తించాడు. తన ఆవేదనను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు.  అనంతరం మళ్లీ ఒక పోస్ట్‌ పెట్టాడు. నైక్‌ ఎలైట్ కస్టమర్‌ సర్వీస్‌ టీం సభ్యుడితో మాట్లాడానని, అతడు తన డబ్బును వాపస్‌ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు