అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం.. వీడియో వైరల్‌

2 Sep, 2022 14:40 IST|Sakshi

బ్యూనస్ ఎయిర్స్‌: అర్జెంటీనా ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ డె కిర్చనర్‌.. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ దుండగుడు గన్‌ ఆమెకు గురిపెట్టి తలకు కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే అతి సమీపంగా జరిగిన ఈ దాడి యత్నంతో అంతా షాక్‌ తిన్నారు. అయితే.. 

ట్రిగ్గర్‌ నొక్కినా గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఆమె సురక్షితంగా దాడి నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే దుండగుడిని పోలీసులు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి బ్యూనస్‌ ఎయిర్స్‌ ఇంటి వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా మంత్రి అనిబల్‌ ఫెర్నాండేజ్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చాలా చానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ సర్క్యులేట్‌ అవుతోంది. 

మిలిటరీ నియంతృత్వ పాలన నుంచి అర్జెంటీనా 1983లో స్వాతంత్రం సంపాదించుకుంది. అయితే.. అప్పటి నుంచి ఈ తరహా హత్యాయత్నాలు జరగడం మాత్రం ఇదే తొలిసారి. దాడికి యత్నించిన వ్యక్తిని బ్రెజిల్‌ వాసి ఫెర్నాండో ఆండ్రే సబాగ్‌ మోనటియల్‌గా గుర్తించారు. అతనిపై ఎలాంటి క్రిమినల్‌ రికార్డు లేదని పోలీసులు ధృవీకరించారు.

క్రిస్టియానా ఫెర్నాండేజ్‌ డె కిర్చనర్.. గతంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 2007-15 మధ్య ఆమె పని చేశారు. అయితే పబ్లిక్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి, అవకతవకలకు పాల్పడారన్న ఆరోపణలతో.. విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె. రుజువైతే ఆమె 12 ఏళ్లు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... 

మరిన్ని వార్తలు