Viral Video: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..

22 Dec, 2022 11:53 IST|Sakshi

అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు  బాలురను  ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని ‍అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు.

పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు.

చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..!

మరిన్ని వార్తలు