మానవ బాంబు ఆడియోలు అమ్మేస్తున్నాడు..

20 Mar, 2021 14:32 IST|Sakshi
అలెక్స్‌ రెమిరెజ్

న్యూయార్క్‌ : మానవ బాంబు(అపాన వాయువు) శబ్ధాలను అమ్మకానికి పెట్టి, సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఒక్కో అపాన వాయువు శబ్ధాన్ని వేల రూపాయలకు అమ్ముతున్నాడు. వివరాలు.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అలెక్స్‌ రెమిరెజ్‌ అనే వ్యక్తి మార్చి 2020లో క్వారెంటైన్‌లో ఉండగా అపానవాయువు శబ్ధాలను రికార్డు చేయటం మొదలుపెట్టాడు. అతడి మిత్రులు కూడా అపాన వాయువు శబ్ధాలను రికార్డు చేసి తమ వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేసుకోసాగారు. ఈ మార్చి 2021కి వారు అపాన వాయువులను రికార్డు చేయబట్టి సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో రికార్డు చేసిన ఆడియోలను కలిపి ఓ పెద్ద ఫైల్‌గా తయారు చేశారు. అది 52 నిమిషాల నిడివి కలిగిన ఆడియో ఫైల్‌గా తయారయింది. అనంతరం ఈ ఫైల్స్‌ను విడివిడిగా అమ్మటం మొదలుపెట్టాడు అలెక్స్‌. ఒక్కో ఆడియో ఫైల్‌ రూ.6,600కు అమ్ముతున్నాడు. కొన్ని సార్లు ఈ ధర రూ.13,257 చేరుతోంది.

దీనిపై అలెక్స్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ డిజిటల్‌ ఆర్ట్స్‌ను, జిప్స్‌ను అమ్ముతున్నారు. అపాన వాయువులను ఎందుకు అమ్మకూడదు. ఒక వేళ అపాన వాయువుల ధర పెరిగితే మన చేతుల్లో చాలా విలువైన అపాన వాయువులు ఉన్నట్టే. మేము దీన్ని ఓ ఆదాయం మార్గంగా భావించటం లేదు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌కు క్రేజ్‌ పెరుగుతున్న తరుణంలో మా ఆడియో రికార్డింగ్స్‌కు ప్రాచూర్యం అభిస్తుంది. ఈ ఎన్‌ఎఫ్‌టీ ఆడియోలు ప్రజల్ని నవ్విస్తాయి.. మమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి’’ అని పేర్కొన్నాడు.

చదవండి : హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది!

వెంటాడిన జనం: చావు భయంతో ఏనుగు పరుగులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు