తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!

17 Dec, 2021 14:36 IST|Sakshi

ఒమిక్రాన్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కఠినమైన కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా కఠినమైన నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఈ ఆంక్షలు నేపథ్యంలోనే కరోన నియమాలనకు లోబడి ప్రవర్తించని ఒక ప్రయణికుడిని యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌  సిబ్బంది విమానం నుంచి నిర్థాక్షిణ్యంగా దింపేసింది.

(చదవండి: ఒమిక్రాన్‌ వైరస్‌ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!)

అసలు విషయంలోకెళ్లితే...యూస్‌లోని లాడర్‌డేల్ విమానాశ్రయం నంచి విమానం బయలు దేరేమందు ప్రయాణికులందరూ మాస్క్‌లు ధరించారో లేదో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు 38 ఏళ్ల ఆడమ్ జెన్నె అనే వ్యక్తి మాస్క్‌ ధరించకుండా ఒక ఎర్రటి వస్త్రాని ధరించి వచ్చాడు. దీంతో విమానాశ్రయ అధికారులు జెన్‌ని మాస్క్‌ విషయమై ప్రశ్నించారు. అయితే జెన్నె ఆహారం తినేటప్పుడు సైతం మాస్క్‌ ధరించమంటూ విమాన సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని వివరణ ఇచ్చాడు.

దీంతో అధికారులు అతని సమాధానికి ఒక్కసారిగా విస్తుపోతారు. ఆ తర్వాత ఏదిఏమైన కోవిడ్‌ -19 నిబంధనల దృష్ట్యా మాస్క్‌ ధరించాల్సిందే లేనట్లయితే దిగిపోవాల్సిందే అంటూ సదరు అధికారులు గట్టిగా ఆదేశించారు. ఈ మేరకు జెన్నెతోపాటు ప్రయాణిస్తున్న​ తోటిప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌ కోవిడ్‌ -19 నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తమ సిబ్బంది, అధికారులపై  ప్రశంసల వర్షం కురిపించింది.

(చదవండి: ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పురస్కారం)

మరిన్ని వార్తలు