కరోనాను కంట్రోల్‌ చేయలేక ప్రధాని రాజీనామా

22 Jan, 2021 08:10 IST|Sakshi

ఉలాన్ బాతర్: కరోనా వైరస్‌ మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్‌ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితి గట్టెక్కేందుకు విశ్వమంతా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది. కరోనా ప్రారంభ దశలో మంగోలియా కట్టడి చర్యలు పటిష్టం తీసుకుంది. 
(చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఎఫెక్ట్స్‌ అన్న బిల్‌గేట్స్‌?)

అయితే ఆ దేశంలో ఇప్పుడు రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీనిపై ఆ దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అయితే ఈ కరోనా విషయంలో ఇద్దరి ఆగ్రహావేశాలు తట్టుకోలేక ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే కరోనా రోగి, ఓ చిన్నారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారికి ఆ అవకాశం కల్పించకపోవడంపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు వచ్చాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తి ప్రధానికి చుక్కలు చూపించింది.
(చదవండి: కరోనా కథలెన్నెన్నో..)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు