కాబూల్‌ ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

1 Jan, 2023 14:29 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో మరోమారు భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకుని రోడ్లను మూసివేశాయి. 

‘కాబూల్‌ మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌ వెలుపల ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.’ అని తెలిపారు ఆర్మీ ప్రతినిధి అబ్దుల్‌ నాఫీ టకోర్‌. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. 

అంతకు ముందు గతేడాది డిసెంబర్‌ 12న ఓ గుర్తు తెలియని సాయుధుడు కాబూల్‌లోని ఓ హోటల్‌లో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ హోటల్‌లో చైనా పౌరులు ఉండటం కలకలం సృష్టించింది. తాలిబన్‌ భద్రతా దళాలు అక్కడికి చేరుకునే ముందు హోటల్‌ నుంచి భారీగా పొగలు వచ్చినట్లు పలు వీడియోల్లో కనిపించింది.

ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్‌ మరణాలు

మరిన్ని వార్తలు