హ్యాండ్సప్‌ అని గన్‌ గురిపెట్టాడో లేదో.. వాటే రియాక్షన్‌!

23 Oct, 2021 17:03 IST|Sakshi

దొంగతనమే వినోదం పంచితే.. దొంగే కావాల్సినంత సరదాను మోసకొస్తే ఎలా ఉంటుంది. మనకు నవ్వులే నవ్వులు. దొంగలకు తొందరెక్కువ అనేది మనకు తెలిసిందే. వారి పనిని ఎంత తొందరగా ముగించుకుంటే అంత తొందరగా బయటపడతారు. మరి ఈ దొంగకు మరీ తొందర ఎక్కువలా ఉంది. ఇలా స్టోర్‌లో అడుగుపెట్టాడో లేదో.. గన్‌ గురిపెట్టి హ్యాండ్సాప్‌ అనబోయాడు. అంతలోనే బెదిరించబడ్డ వ్యక్తి గన్‌తో పాటు అతన్ని కూడా మెలేసి కిందపడేలా చేశాడు. 

వివరాల్లోకి వెళితే..  నేవీ డిపార్ట్‌మెంట్‌ విభాగంకు చెందిన ఒక మాజీ ఉద్యోగి యూఎస్‌లోని యుమాలోనే ఒక గ్యాస్‌ స్టేషన్‌ స్టోర్‌కు వెళతాడు. అక్కడ ఎవరితోనూ మాట్లాడుతుండగా ఇద్దరు దుండగులు లోపలకి వస్తారు. వారిలో ఒక దొంగ వచ్చిందే తడువుగా అక్కడ ఉన్న వ్యక్తికి గన్‌ గురిపెట్టి హ్యాండ్పప్‌ అనబోతాడు. ఆ దొంగ అలా హ్యాండ్సప్‌ అంటాడో లేదో వెంటనే రియాక్ట్‌ అవుతాడు మెరైన్‌ కార్ప్స్‌కు చెందిన వ్యక్తి. ఆ గన్‌ గురి పెట్టిన దొంగ చేతిని అమాంతం పట్టుకుని గట్టిగా వెనక్కి తోస్తాడు.

ఆ దెబ్బకు పక్కనున్న మరో దొంగ వెళ్లి డోర్‌ దగ్గర పడతాడు. ఇక్కడ దొంగతనం మాట ఎలా ఉన్నా దొంగలకు ఎదురైన అనుభవం మాత్రం తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీసీ ఫుటేజ్‌ వీడియో  ఇప్పుడు వైరల్‌గా మారడమే మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి. ఆ దొంగలపై చాకచక్యంగా తిరగబడిన ఆ మాజీ ఉద్యోగిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు