Afghanistan Women: అఫ్గాన్‌ బోర్డర్‌ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!

3 Sep, 2021 17:58 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్‌ దాటించే ప్రయత్నం చేస్తున్నారు.  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్‌ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి  దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. 

చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్‌!. మనకేం ఫరక్‌ పడదు

ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్‌ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు.

చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్‌ సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా

మరిన్ని వార్తలు