చైనీయులు తైవాన్‌ విషయమై ఏం అన్న ఊరుకునేట్లు లేరు! సారీ చెప్పాల్సిందే

5 Aug, 2022 18:49 IST|Sakshi

తైవాన్‌ విషయమై ఆగ్రహం​తో ఊగిపోతున్న చైనా తాజాగా స్నీకర్‌ సంస్థ తయారీదారుల చేత క్షమాపణలు చెప్పించుకుంది. ఈ మేరకు  స్నీకర్‌ క్యాండీ చాకోలెట్‌ తయారీ సంస్థ మార్స్‌ రిగ్లీ చైనా సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెపింది. ఇంతకీ ఏ జరిగిందంటే...స్నీకర్స్‌ క్యాండీకి సంబంధించిన ఈవెంట్‌ ప్రమోటింగ్‌లో భాగంగా ఒక వీడియోని విడుదల చేసింది.

ఆ వీడియోలో పరిమిత పరిధిలో లభించే స్నీకర్‌క్యాండీలు కేవలం దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్‌ దేశల్లోనే లభిస్తుంది అని వస్తుంది. అంతే ఈ వీడియో చైనాకి సంబంధించిన మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ ఫాం వీబోలో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో చైనీస్‌ నెటిజన్లు తైవాన్‌ ఒక దేశామా అంటూ ఆగ్రహంతో సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే దెబ్బకు స్నీకర్‌ చాకోలెట్‌ తయారీ సంస్థ మార్స్‌ రిగ్లీ తన చైనా వీబో అకౌంట్‌లో క్షమాపణలు చెప్పడమే కాక ఆ వీడియోని సవరించింది కూడా.

(చదవండి: తైవాన్‌ టెన్షల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా)

మరిన్ని వార్తలు