'ఒక్క పనితో మా మనసులు దోచేసింది'

29 Sep, 2020 19:29 IST|Sakshi

మీరు రెస్టారెంట్‌కు వెళితే మీ బిల్లు ఎవరు కడుతారు.. అదేంటి ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా.. సాధారణంగా అయితే మనం లేక మనతో పాటు వచ్చిన స్నేహితులలో ఎవరో ఒకరు బిల్లు చెల్లిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మెక్‌డొనాల్డ్‌లో పనిచేస్తున్న ఒక మహిళ ఒక కస్టమర్‌ బిల్లును తనే స్వయంగా చెల్లించి అతన్ని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళితే..  జోష్‌ అనే వ్యక్తి తన తల్లిని తీసుకొని మెక్‌డొనాల్డ్‌కు వచ్చాడు. తన తల్లికి ఇష్టమైన ఫుడ్‌ అడిగి ఆర్డర్‌ చేశాడు. ఫుడ్‌ తిన్న తర్వాత బిల్‌ చెల్లిద్దామని జోష్‌ కౌంటర్‌ వద్దకు వచ్చాడు. అయితే కౌంటర్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్‌ ఉద్యోగిణి ఇన్యా మీ బిల్‌ నేను పే చేస్తున్నా అంటూ తన కార్డ్‌ను స్వైప్‌ చేసింది. కాగా జోష్‌ అందుకు సంబంధించిన వీడియోనూ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. (చదవండి : వైరల్‌ వీడియో.. ప్రియుడిని తన్నిన యువతి)

'మెక్‌డొనాల్డ్‌లో ఎంప్లాయ్‌గా పనిచేస్తున్న ఇన్యా మా బిల్‌ను చెల్లించింది. ఆమె ఎందుకిలా చేసిందో నాకు చెప్పలేదు గాని.. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే కొంచెం బాధతో వచ్చిన నన్ను ఇన్యా తన పనితో నా మొహంలో ఆనందం నింపింది. బహుశా నేను బాధలో ఉన్నట్లు ఇన్యా గుర్తించినట్లుంది. అందుకే ఆమె చేసిన ఈ సాయాన్ని గొప్ప ప్రతిఫలంతో తిరిగి ఆమెకు అందిస్తాను.'అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇన్యా చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క పనితో మా మనుసులు దోచేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

మరిన్ని వార్తలు