మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’ వివాదం

15 Nov, 2021 09:03 IST|Sakshi

కొన్ని కొన్ని పనులు సదుద్దేశంతో చేసినప్పటికీ ఒక్కొసారి మనకు తెలియకుండానే అవి పెద్ద పెద్ద వివాదాలకు దారితీసేలా తయారువుతాయి. అచ్చం అలాంటి పరిస్థితినే బ్రెజిల్‌లోని ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎదుర్కొంటుంది.

(చదవండి:  కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!!)

అసలు విషయంలోకెళ్లితే....బ్రెజిల్‌లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయిలెట్‌ బాత్‌రూమ్‌ పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ యూనిసెక్స్‌ టాయిలెట్‌ రూమ్‌ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్‌డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకేలాంటి టాయిలెట్‌ రూమ్‌ లేంటి అంటూ ఒక మహిళ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేశారు. పైగా చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినయోగిస్తారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న ఒక ఆడియో క్లిప్‌ను కూడా  ఆరోగ్య అధికారులకు పంపించారు .

దీంతో ఆరోగ్య అధికారులు మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ని సందర్శించడమే కాక ఆరోగ్య నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజల ఆ‍రోగ్య దృష్ట్యా నిమిత్తమే కాక అందురూ గుర్తించే విధంగా పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఉండాల్సిందేనని చెప్పారు. పైగా రెస్టారెంట్‌లో రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఏర్పాటు చేయాలని లేనట్టయితే మూసివేయడం లేదా జరిమాన వంటి చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందంటూ అధికారులు హెచ్చరించారు. అయితే మెక్‌డొనాల్డ్స్‌ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించడానికి స్వాగతించేలా కొద్దిపాటు మార్పులతో ఈ బాత్రూంలు రూపొందించామని అంతేకాక నిర్థిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధికారులకు సహరికరిస్తామంటూ వివరణ ఇచ్చుకుంది.

(చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ!)

మరిన్ని వార్తలు