Wuhan Lab Theory: కరోనా పుట్టుకపై ఫారిన్‌ సైంటిస్ట్‌ వివరణ

29 Jun, 2021 10:49 IST|Sakshi

కరోనా.. ఎలా పుట్టిందో కూడా తెలియకుండా.. మనుషుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న వైరస్‌. ఈ మహమ్మారి పుట్టుక మిస్టరీని చేధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంతువుల ద్వారా వ్యాపించిందనుకుని నిర్ధారణకు వచ్చేలోపు.. ల్యాబ్‌ థియరీ తెరపైకి వచ్చింది. అయితే కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యల చేసింది గతంలో అందులో పనిచేసిన ఓ ఫారిన్‌ సైంటిస్ట్‌.   

సిడ్నీ: డానియెల్లే ఆండర్సన్‌.. ఆస్ట్రేలియన్‌ సైంటిస్ట్‌. వయసు 42 ఏళ్లు. కరోనా విజృంభణ టైంలో వుహాన్‌ ల్యాబ్‌లో పనిచేసిన ఏకైక ఫారిన్‌ సైంటిస్ట్. ఆమె రిలీవ్‌ అయిన తర్వాత ఏ విదేశీ సైంటిస్ట్‌ అందులో చేరలేదు(కరోనా ఆరోపణల నేపథ్యంలో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు).  దాదాపు కొన్ని నెలలపాటు బీఎస్‌ఎల్‌-4 ల్యాబ్‌లో పనిచేసిన డానియెల్లే..  ప్రమాదకరమైన జబ్బులకు సంబంధించిన పరిశోధనల్లో భాగమైంది. ఆమె నవంబర్‌ 2019లో ఆమె విధుల నుంచి రిలీవ్‌ అయ్యింది. అయితే కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌లో పుట్టిందన్న ఆరోపణల్ని ఆమె ఇప్పుడు తోసిపుచ్చుతోంది.   చదవండి: బెంగాలీ కుర్రాడి వల్లే వుహాన్‌ కుట్ర వెలుగులోకి!

 

‘‘ల్యాబ్‌లో ఆ సీజన్‌లో రోజూ నేను పని చేశా. కానీ, అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కరోనా మూలాలేవీ ఆ ల్యాబ్‌లో నాకు కనిపించలేదు. ఏ సైంటిస్ట్‌ అలాంటి అనుమానాస్పద ప్రయోగాలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అనుమానాలే నిజమైతే.. రోజూ కంటెయిన్‌మెంట్‌ ల్యాబ్‌లో పని చేసిన నేను కొవిడ్‌ బారిన పడాలి కదా. కానీ, అలా జరగలేదు. ప్రతీరోజూ నేను అందరితో టచ్‌లో ఉన్నా. అందరం కలిసే తిన్నాం. కలిసే తిరిగాం. అందుకే ల్యాబ్‌ లీకేజీ థియరీని నేను ఖండిస్తున్నా. వైరస్‌ సహజంగా పుట్టిందే అని నేను నమ్ముతున్నా’’ అని బ్లూమరాంగ్‌ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయం వెల్లడించారు. చదవండి: చైనాలో వయాగ్రా దోమల భయం!

ఇక వుహాన్‌ ల్యాబ్‌లో పనిచేసిన సైంటిస్టులు ముక్తకంఠంతో ల్యాబ్‌ లీకేజీ థియరీని ఖండిస్తున్నారు. కాగా, అక్టోబర్‌లో సార్స్‌ కోవ్‌2 విజృంభణ మొదలైందని చైనా ప్రకటించాక.. వైరస్‌ అనుమానాలు కూడా డ్రాగన్‌ కంట్రీ మీదకే మళ్లాయి. అయితే తమప్రమేయం లేదని ఆరోపణల్ని తోసిపుచ్చినా.. కొందరు విదేశీ సైంటిస్టులు మాత్రం నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో డబ్ల్యూహెచ్‌వో బృందం వుహాన్‌ ల్యాబ్‌ను పరిశీలించడం.. నివేదిక కూడా దాదాపు చైనాకే అనుకూలంగానే ఇచ్చింది. కోల్డ్ చెయిన్‌ ప్రొడక్టుల(ఆస్ట్రేలియన్‌ బీఫ్‌ లాంటి ఉత్పత్తులు) ద్వారా వైరస్‌ వ్యాప్తి చెంద ఉండొచ్చని చైనా అనుమానాల్ని డబ్ల్యూహెచ్‌వో బృందం దగ్గర వ్యక్తం చేసింది.

చదవండి: కరోనా.. వుహాన్‌ కంటే ముందు అక్కడ!

మరిన్ని వార్తలు