ఈ సమంత టాలెంట్‌ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు

30 Jul, 2021 19:46 IST|Sakshi

అదిపెద్ద నోరుతో గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డు 

సమంత రామ్స్‌డెల్  అరుదైన రికార్డు

తనలోని వైవిధ్యాన్ని అద్భుతంగా మలుచుకున్న తీరు

సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద నోరుతో  వైరల్‌ అయిన టిక్‌టాక్‌ స్టార్‌ స‌మంత రామ్స్‌డెల్ (31) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కనెక్టికట్‌కు చెందిన సమంత 6.52 సెంటీమీటర్ల మేర విస్తరించగలిగే పెద్ద నోరుతో ప్రపంచంలోనే అతిపెద్ద నోరున్న మహిళగా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది. దాదాపు ఒక పెద్ద యాపిల్‌ పట్టేంత వెడల్పుగా తన నోరును సాగదీయగలదు.  అలాగే ఒ​క పెద్ద సైజు ప్యాకెట్‌లోని  ఫ్రెంచ్ ఫ్రైస్‌  మొత్తంపట్టేస్తాయి. దీంతో సమంత మరోసారి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

స‌మంత సరదాగా టిక్‌టాక్‌లో షేర్ చేసే వీడియోలు పాపుల‌ర్ కావ‌డంతో అందరూ గిన్నిస్‌ రికార్డు కోసం ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. ఈ ఐడియానే ఆమెకు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ టైటిల్  తెచ్చిపెట్టింది. అమెరికాలోని కనెక్టికట్‌లోని సౌత్ నార్వాక్‌లోని  డెంటిస్ట్ కార్యాల‌యానికి  వెళ్లి మరీ అధికారులు కొలతలను తీసుకొని ధృవీకరించారు. ఆమె నోటి పొడవు, వెడల్పును లెక్కించి అతి పెద్ద నోరుగా డాక్టర్ ఎల్కే చెంగ్  ప్రకటించారు.

తనకు చిన్నప్పటినుంచీ నోరు పెద్దదిగా ఉండేదని, దీంతో చాలా అవమానాలను ఎదుర్కొన్నానని "బిగ్ బాస్ నోరు" అంటూ ఎగతాళి చేసేవారని సమంత గుర్తు చేసుకుంది.  కానీ ఇపుడు ఈ నోటితోనే రికార్డు సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. గత ఏడాది కరోనా సమయంలో టైం పాస్‌ కోసం, సృజనాత్మక, కామెడీ పోస్ట్‌లు చేయడం మొదలుపెట్టింది. ఫన్నీ వీడియోలు,  ప్రత్యేకమైన  కామెడీ పోస్ట్‌లతో క్రమంగా  స్టార్‌గా మారిపోయింది.   

ప్రస్తుతం సమంతకు టిక్‌టాక్‌లో  1.7 మిలియన్లమంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాలో 84 వేలకు ఫోలోవర్లు ఉండటం విశేషం. తన పెద్ద నోరే ఇంతగొప్ప పేరు తెచ్చి పెట్టిందని లక్షలమంది కమెడీయన్లు, గాయకుల కంటే ఎక్కువ ఫేమ్‌ తెచ్చిపెట్టిందని, ఇలా అవుతుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. నిజానికి ఇది అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయింది. అంతేకాదు ఈ ప్రత్యేక టాలెంట్‌తోపాటు హాస్యం, సింగింగ్‌ కళను ఉపయోగించుకొని ఏదో ఒక రోజు తన సొంత షోను మొదలుపెట్టాలనే ఆశాభావాన్ని వ్యక‍్తం చేసింది.

‘నా లైఫ్‌ అంతా నా నోరు విషయంలో చాలా అభద్రతగా ఫీలయ్యాను. కానీ ఇపుడుదాన్నే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను. అతిపెద్ద లోపాన్ని గొప్ప ఆస్తిగా మార్చుకున్నాను. ఇది స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా..మీలో ఉన్న వైవిధ్యాన్ని చూసి భయపడొద్దు ఇతరులకంటే భిన్నంగా ఉన్నదాన్ని స్వీకరించండి. అదే మీ సూపర్ పవర్’ అంటూ సూచిస్తోంది. 

A post shared by Samantha Ramsdell (@samramsdell5)

మరిన్ని వార్తలు