133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్‌పాట్‌!

22 Sep, 2022 07:25 IST|Sakshi

ఇద్దరు అమెరికన్లను వరించిన అదృష్టం

షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్‌ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్‌. గత ఏప్రిల్‌ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట.

ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి..

మరిన్ని వార్తలు