డబ్బు ఎర చూపి వీవీఐపీ ట్రీట్మెంట్‌ పొందిన చోక్సి

19 Jun, 2021 05:24 IST|Sakshi

రోజో: భారత్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన మెహుల్‌ చోక్సి డొమినికా రాజధాని రోజోలోని ఆస్ప త్రిలో వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ పొందుతున్నట్లు సమాచారం. డొమినికాలో న్యాయ పర్యవేక్షణలో ఉన్న ఆయన 2 వారాల క్రితం ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రిలో చేరారు. అనంతరం  తనకు చల్లదనం కోసం ఏకంగా ఆస్పత్రికే ఏసీలు దానం చేశాడని, వైద్యులకు లంచాలిచ్చి వీవీఐపీ ట్రీట్మెంట్‌ పొందుతున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని, చోక్సి మరోసారి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. గురువారం ఆయన రోజోలోని కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాలను  చూపి హాజరుకాలేదు. చివరకు కోర్టు.. చోక్సి చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదినే జైలుగా మార్చాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు