‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’

9 Nov, 2020 10:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో చాలా స్పష్టమైన మెజారిటీతో గెలుపొంది జోబిడెన్‌ అధ్యక్ష పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తం కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇదిలా వుండగా ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ఆయనకు చుక్కెదురయ్యింది. ఈసారి ట్విటర్‌ వేదికగా ట్రంప్‌ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఓటమిని అంగీకరించాలని ట్రంప్‌ అల్లుడు కుష్నర్‌ కూడా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ సన్నిహితులు కూడా ఇంకా అంతా అయిపోయిందని ఓటమిని అంగీకరించాలని ట్రంప్‌కు హితవు పలుకుతున్నాయి. ఇక ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ గౌరవప్రదంగా వైట్‌హౌస్‌ నుంచి బయటకు వెళ్దాం అని ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయాన్ని ఆమె బహిరంగంగా వెలిబుచ్చలేదు. అయితే ట్రంప్‌ కుమారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తగ్గటానికి వీలు లేదని మొండిపట్టు మీద ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: ‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిని..!

మరిన్ని వార్తలు