ట్రంప్‌ దంపతుల విడాకులు ఖాయమేనా..

23 Jan, 2021 17:46 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో వాళ్ల అధికారం ముగిసియడంతో ట్రంప్‌ దంపతులు వైట్‌హౌజ్‌ వీడి తిరుగు పయనం అయ్యారు. ఈ నేపథ్యంలో విమానంలో ఫ్లోరిడా చేరుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా ట్రంప్‌లను మీడియా పలకరించింది. అయితే విమానం నుంచి దిగుతున్న వారికి మీడియా ఎదురుపడి ఫొటోలు తీస్తుండగా ట్రంప్‌ వారిని గుర్తించి కెమెరాలకు ఫోజ్‌ ఇచ్చారు. అయితే మెలానియా ట్రంప్‌ మాత్రం ఆగకుండా తన దారిన సైలెంట్‌గా‌ వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెలానియా తీరుపై నెటిజన్‌లు మీమ్స్‌ క్రియోట్‌ చేస్తూ పోస్ట్‌ చేస్తున్నారు. ట్రంప్‌తో కలిసి ఫోజ్‌ ఇవ్వడం ఇష్టం లేకే ఆమె ఇలా చేశారంటూ మరోసారి వారి విడాకుల విషయంపై చర్చించుకుంటున్నారు. (చదవండి: వైట్‌హౌజ్‌ను వీడిన తర్వాతే.. ఎందుకంటే!)

‘4 సంవత్సరాల తర్వాత మెలానియా చివరకు మళ్లీ సంతోషంగా నవ్వుకుంటున్నారు. ప్రకృతి తనకు సహకరిస్తోంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే ట్రంప్‌ వైట్‌హౌజ్‌ను వీడాక మెలానియా విడాకులు ఇవ్వనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మెలానియా తీరు చూసి నెటిజన్‌లు త్వరలోనే భర్త డొనాల్డ్‌ ట్రంప్‌‌కు ఆమె విడాకులు ఇవ్వడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్రంప్‌ రాజకీయ సహాయకురాలు ఓమరోసా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే మెలానియా ట్రంప్‌కు విడాకులు ఇవ్వనున్నారు. తన 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు ఎదురుచుస్తున్నారు. ట్రంప్‌కు భార్యగా తను నిమిషాలు లెక్కబెడుతున్నారు. వైట్‌హౌజ్‌ వీడిన అనంతరం విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు’ ఒమరోసా తను రాసిన పుస్తకంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. (చదవండి: విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో..)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు