ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్

21 Oct, 2020 09:36 IST|Sakshi

వాషింగ్టన్: కరోనావైరస్ సోకిన తరువాత అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎడతెగని దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రానున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అరుదైన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని   ప్రతినిధి వెల్లడించారు. మెలానియ భర్త,  ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వైరస్ నుంచి మెలానియా ట్రంప్  ఆరోగ్యం  రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని  స్టెఫానీ తెలిపారు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ, విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి వెళ్లడం లేదన్నారు. గత రెండు వారాల్లో ట్రంప్ రోజుకు కనీసం ఒక ర్యాలీతో ఎన్నికల  ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.  2019 నుండి తన భార్యతో వేదికపై కనిపించలేదు. మెలానియా పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి అతి కీలకమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అనారోగ్యం కారణంగా ఆ గోల్డెన్ చాన్స్ ను మెలానియా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు.  కాగా  ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ (14) కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు