వైరల్‌ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!

14 Jul, 2021 20:51 IST|Sakshi

కాన్‌బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్‌కి చెందిన జాక్కి విలియమ్స్‌(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్‌ మెటాలమ్‌ జ్యువెలరీలో  చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది.

దీని పై విలియమ్స్‌ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ  కోసం ఐయూడీని ఉపయోగించి  ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్‌సైట్‌లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని  జాక్కి విలియమ్స్‌  పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు