ప్ర‌తి ఏటా మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో బిల్‌ గేట్స్ టూర్‌

6 May, 2021 19:08 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: నాలుగు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్ బిల్‌ గేట్స్ త‌న భార్య‌ మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు  ప్ర‌క‌టించి ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వార్త ప్ర‌స్తుతం అంద‌రిని ఆక‌ర్షిస్తోంది. ఏంటంటే బిల్ గేట్స్ ఏటా త‌న మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్తార‌ట‌. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏంటంటే దీని గురించి మిలిందా గేట్స్కు కూడా తెలుస‌ట‌. 

ఆ వివ‌రాలు.. మిలిందాతో వివాహానికి ముందు బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ అనే మ‌హిళ‌ను ప్రేమించార‌ట‌. కానీ ఆ త‌ర్వాత మిలిందాను వివాహం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బిల్ గేట్స్ వివాహానికి ముందే దీని గురించి మిలిందాతో చెప్పాడ‌ట‌. ప్ర‌తి ఏటా వ‌సంత కాలంలో తాను అన్ విన్‌బ్లాడ్‌తో టూర్ వెళ్తాన‌ని తెలిపాడ‌ట. అందుకు మిలిందా కూడా అంగీక‌రించింది అని స‌మాచారం. 

ఇక బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ ప్రతి ఏటా వ‌సంత కాలంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని బీచ్ కాటేజ్‌లో ప్రైవేట్ సమయాన్ని గడపడానికి వెళ్తారు. దీనిపై విన్‌బ్లాడ్ స్పందిస్తూ "మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం బ‌యోటెక్నాల‌జీ మీద ఆస‌క్తి ఉన్న ఇద్ద‌రు వేర్వేరు వ్య‌క్తుల మ‌ధ్య ఉన్న సంబంధం లాంటిది. ఈ టూర్‌లో మేం మా గురించి, ప్ర‌పంచం గురించి చ‌ర్చించుకునేవాళ్లం. ఇక మిలిందా బిల్‌గేట్స్‌కు అన్ని విధాల త‌గిన భార్య" అన్నారు.

ది పోస్ట్ ప్రకారం, ఆన్ విన్‌బ్లాడ్‌, శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ ప్రైవేట్ ప‌రిశోధ‌కుడైన‌ ఎడ్వర్డ్ అలెక్స్ క్లీన్‌ను వివాహం చేసుకుంది. అతను నేరాలు, మోసం, పౌర హక్కుల కేసులను విచారించే ‘అలెక్స్ క్లైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ సర్వీస్’ యజమాని. విన్‌బ్లాడ్ ఒక సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకురాలు. 

1997లో టైమ్స్ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. "విన్‌బ్లాడ్‌ నా క‌న్న ఐదేళ్లు పెద్ద‌ది. మిలిందాతో నా వివాహం గురించి ముందుగా విన్‌బ్లాడ్‌కే చెప్పాను. త‌న అంగీక‌రంతోనే నేను మిలిందాను వివాహం చేసుకున్నాను. విన్‌బ్లాడ్‌ను ప్ర‌తి ఏటా ఒక్క‌సారి క‌లుస్తాన‌ని వివాహానికి ముందే మిలిందాకు చెప్పాను. త‌ను కూడా అంగీక‌రించిది" అని బిల్‌గేట్స్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ‌

చ‌ద‌వండి: బిల్‌ గేట్స్‌ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు