అమెరికాలో భారత మహిళలపై జాతివివక్ష దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ..

5 Sep, 2022 13:14 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌జాతివివ‌క్ష దాడి జ‌రిగింది. మెక్సిక‌న్‌కు చెందిన మ‌హిళ ఓ పార్కింగ్‌ లాట్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ను ఇష్టం​ వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్‌ కనిపిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్‌ లైఫ్‌ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియ‌న్ క‌మ్యూనిటీలో వైర‌ల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు. కాగా, మెక్సిక‌న్ మ‌హిళ‌ను ఎస్మ‌రాల్డో ఉప్ట‌న్‌గా గుర్తించారు.

ఇది కూడా చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్‌స్కీకి సపోర్ట్‌పై భారత్‌ ‘టెక్నికల్‌’ వివరణ

మరిన్ని వార్తలు