చెమటను నిరోధించే సర్జరీ వికటించి యంగ్‌ బాడీ బిల్డర్‌ మృతి

16 Jul, 2021 11:08 IST|Sakshi

Mexican Influencer Odalis Santos Mena: మెక్సికన్‌ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌, యంగ్‌ బాడీ బిల్డర్‌ ఒడాలిస్‌ సాంటోస్‌ మీనా శస్త్ర చికిత్స వికటించి మృత్యువాతపడింది. 23 ఏళ్ల ఒడాలిస్‌ తన శరీరంలోని చెమటను నివారించేందుకు చేసుకున్న సర్జరీ వికటించి జూలై7న ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల మెక్సికోలోని గ్వాడాలజారాలోని స్కిన్‌పీల్ క్లినిక్ అండర్ ఆర్మ్(బాహువుల కింద) చెమటను తగ్గించడానికి చేసే చికిత్స ‘నో స్వెట్‌’ను ప్రోత్సహించడానికి ఓడాలిస్‌ను ప్రమోటర్‌గా నియమించుకుంది. ఇందులో చెమట గ్రంథులను తొలగించడానికి హీట్‌ ఎనర్జీని ఉపయోగిస్తూ చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని దుర్వాసన, అండర్ ఆర్మ్ జుట్టును తగ్గించడానికి దోహదపడుతుంది. తాజాగా ఒడాలిస్‌ ‘నో స్వెట్‌’ చికిత్సను చేయించుకున్నారు.

అయితే శస్త్రచికిత్సలో భాగంగా అధిక అండర్‌ ఆర్మ్‌ చెమటను నిరోధించేందుకు ఒడాలిస్‌ చెమట గ్రంథులను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో మత్తుమందు ఇంజక్షన్‌ తీసుకున్న తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే క్లినిక్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్‌ ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఒడాలిస్‌ చనిపోయారు. కాగా ఒడాలిస్‌ మృతిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు అందించిన మత్తుమందు, స్టెరాయిడ్‌ ప్రభావం వల్లే మరణించినట్లు పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లినిక్‌లో శిక్షణ లేని వ్యక్తి మత్తుమందు ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని అక్కడి మరో మీడియా పేర్కొంది. ఇక సాంటోస్‌ మీనాకు ఇన్‌స్టా‍గ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. పలు బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొంది. అలాగే 2019లో మిస్ మరియు మిస్టర్ హెర్క్యులస్ టైటిల్‌తో పాటు వెల్‌నెస్ ఫిట్‌నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలిచింది

A post shared by Odalis Santos Mena (@odalis_sm)

A post shared by Odalis Santos Mena (@odalis_sm)

మరిన్ని వార్తలు