మెక్సికో అధ్యక్షుడికి కరోనా

25 Jan, 2021 12:47 IST|Sakshi

మెక్సికో: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ  కరోనా మహమ్మారి ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మ్యానుయల్ లోపేజ్ ఒబ్రాడార్‌(67) కరోనా  బారిన పడ్డారు. స్వయంగా అధ్యక్షుడు ఒబ్రాడార్  ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.  తనకు కరోనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలియజేసేందుకు చింతిస్తున్నానంటూ ట్విట్‌ చేశారు. అయితే స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. వైద్యుల సూచన మేరకు  ‍క్వారంటైన్‌లో ఉండి,చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.  ఈ వైరస్ నుంచి త్వరగా కోలుకుంటాననే  విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్పుత్నిక్ వి కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు సంబంధించి సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడతానని వార్తలు వెలువడిన కొద్దిసేపటికే ఆయన ఈ ప్రకటన చేశారు.

కాగా కరోనా నివారణకుగాను లాక్‌డౌన్‌ను వ్యతిరేకించిన ఒబ్రడార్‌, ప్రపంచంలో అత్యథిక కోవిడ్ మరణాల సంఖ్యలో మెక్సికోమూడో స్థానంలో నిలిచిన  దేశాన్ని తాయెత్తు ద్వారా కరోనానుంచి కాపాడుకుంటున్నానంటూ వివాదాస్పద ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  కాగా  మెక్సికోలో దాదాపు 150,000  కోవిడ్‌ మరణాలు నమోదు గాకా,  1.7 మిలియన్లకు పైగా వైరస్‌ బారినపడ్డారు.

మరిన్ని వార్తలు