Michiyo Tsujimura: గ్రీన్‌ టీ గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పింది ఈమెనే.. ఏయే సమయాలలో గ్రీన్‌టీ తాగకూడదో తెలుసా?

17 Sep, 2021 08:11 IST|Sakshi

Michiyo Tsujimura Google Doodle: గ్రీన్‌ టీ.. కరోనాకి కొంతమందికి.. కరోనా తర్వాత చాలామందికి లైఫ్‌లో ఇదొక పార్ట్‌గా మారింది.  ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు లావు ఉన్న వాళ్లు సన్నబడేందుకు ఇదొక ప్రత్యామ్నాయంగా ఫీలైపోతుంటారు.  అయితే గ్రీన్‌ టీ గొప్పదనం గురించి ప్రపంచానికి చెప్పిన ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. ఆమె పేరే మిచియో సుజిమురా.
 

మిచియో సుజిమురా.. జపనీస్‌ ఎడ్యుకేషననిస్ట్‌, బయోకెమిస్ట్‌.  గ్రీన్‌ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలియజేసింది ఈమేనే. ఆ పరిశోధనలకుగానూ మిచియోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇవాళ ఆమె 133వ జయంతి. అందుకే గూగుల్‌ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్‌ను రిలీజ్‌ చేసింది.
 
మిచియో సుజిమురా.. జపాన్‌లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కారు. 

► గ్రీన్‌ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించింది. వాటిని ప్రపంచానికి తెలియజేసింది ఆమెనే. 

► సుజిమురా 1888 సెప్టెంబర్‌ 17న సైతామా రీజియన్‌లోని ఓకేగావాలో పుట్టారు.
 

 ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి 

స్కూల్‌ చదువులు పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్‌ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్‌ చేశారు. 

గ్రీన్‌ టీపై పరిశోధనల్లో డాక్టర్‌ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. 

గ్రీన్‌ టీలో విటమిన్‌ బి-1 ఉంటుందని గుర్తించింది ఆయనే(సుజుకీ).


 వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించవచ్చు. 

  సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్‌ పరిశోధనల్లో విటమిన్‌ సీని గ్రీన్‌ టీలో గుర్తించారు 

1929లో తన ఒంటరి పరిశోధనల్లో గ్రీన్‌ టీలో ఫ్లవనాయిడ్‌ కాటెచిన్‌, 1930లో టానిన్‌లు ఉన్నట్లు సుజిమురా గుర్తించారు. 

ఈ పరిశోధనలన్నింటిని మేళవించి ‘ఆన్‌ ది కెమికల్‌ కాంపోనెన్‌ట్స్‌ ఆఫ్‌ గ్రీన్‌ టీ’ పేరుతో థీసిస్‌ రూపొందించారు.

1932లో వ్యవసాయంలో డాక్టరేట్‌ గౌరవపట్టా పొందిన తొలి జపాన్‌ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు. 

గ్రీన్‌ పరిశోధనలతో పాటు విద్యావేత్తగా ఆమె పేరు సంపాదించుకున్నారు. 

టోక్యో హోం ఎకనమిక్స్‌ యూనివర్సిటీకి ఆమె మొట్టమొదటి డీన్‌ కూడా. 

గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేస్తుంది.

ప్రొఫెసర్‌గా పని చేసిన మిచియో సుజిమురా .. 1955లో రిటైర్‌ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా పార్ట్‌ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు. 

1969, జూన్‌ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మిచియో కన్నుమూశారు.   

ఓకేగావా సిటీలో ఆమె స్మరణానర్థం పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపాన్ని నిర్మించారు.   

గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్‌ రీసెర్చర్లు చెప్తున్నారు. 


గ్రీన్‌ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది

ఈ టైంలో వద్దు.. 

  • రాత్రి పడుకునే ముందు
  • గ్రీన్‌టీతో మందులు వేసుకోకూడదు
  • మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు

ముందుగా చెప్పుకున్నట్లు కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

ఈ గ్రీన్‌ టీ రుచుల గురించి మీకు తెలుసా?

మరిన్ని వార్తలు