Stangest Thing I Have Ever Worked On: నా కెరియర్‌లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల

28 Sep, 2021 18:18 IST|Sakshi

టిక్‌ టాక్‌ జోలికి మేము వెళ్లలేదు అదే మా వద్దకు వచ్చింది.

క్రిప్టోకరెన్సీ నిబంధనల పట్ల ప్రభుత్వానికి మద్దతిస్తున్నాం

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్‌​ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈఓగా పనిచేసిన సత్య నాదెళ్ల ఆ కంపెనీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్య భరితమైన నిర్ణయాలతో సంస్థను లాభాల దిశగా నడిపించిన నాదేళ్ల​ తన కెరియర్‌లో టిక్‌టాక్‌ ఒప్పందం  విచిత్రమైన ఒప్పందం నేనుఇప్పటికీ దాని మీదే పనిచేస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  మైక్రోసాఫ్ట్‌ కంపెనీ గతేడాది సోషల్‌ మీడియా యూప్‌ టిక్‌టాక్‌ని స్వాధీనం చేసుకునే ఒప్పందం విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

(చదవండి: వలలో పడ్డ భారీ షార్క్‌.. పాత రికార్డులన్నీ బ్రేక్‌)

ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ మాతృక సంస్థ బైట్‌ డ్యాన్స్‌ను  వినియోగదారుల డేటా భద్రత దృష్ట్య యూఎస్‌ వర్షన్‌ నుంచి తొలగించమన్న సంగతిని గుర్తు చేశారు. దీంతో గతేడాది ఆగస్టు 2020లో ట్రంప్‌ ప్రభుత్వంతో కుదుర్చకున్న ఒప్పందం కాస్త ఆయన పదవీచ్యుతుడు కావడంతోనే  రద్దు అయ్యిపోయిందని అన్నారు . అంతేకాదు చైనాకు చెందిన టిక్‌టాక్, విచాట్‌లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో కోడ్‌ సమావేశంలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ....  "మైకోసాఫ్ట్‌ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్‌ నౌపుణ్యాలను టిక్‌టాక్‌ యాప్‌లోకి తీసుకురావడం కోసం ఎదురుచూస్తున్నాం. తాను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను గానీ టిక్‌టాక్‌ విషయంలో ఇలా జరగడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను. టిక్‌ టాక్‌ జోలికి మేము వెళ్లలేదు అదే మా వద్దకు వచ్చింది. 

తాము  అభివృద్ధి చేసిన చైల్డ్‌ భద్రతకు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ వీడియో గేమింగ్‌ టూల్స్‌, బిజినెస్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్‌డ్‌ ఇన్‌ వంటి ఆత్యాధునిక టెక్నాలజీ సేవల పట్ల టిక్‌టాక్‌ మాతృక సంస్థ బైట్‌డ్యాన్స్‌ సీఈవో జాంగ్ యిమింగ్‌ని కూడా ఆకర్షితులయ్యారని చెప్పారు. ఆ ఒప్పందం విషయంలో జో బెడెన్‌ ప్రభుత్వ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చెప్పలేను. అయితే జోబైడెన్‌ ప్రభుత్వం ఆ యాప్‌లు అమెరికా జాతీయ భద్రతకు విసిరే సవాళ్లపై స్వయంగా సమీక్ష చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. అంతేకాదు క్రిప్టోకరెన్సీ నిబంధనల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికీ మద్దతిస్తున్నాం. ప్రస్తుతం నేను చేస్తున్నదాంతో సంతోషంగా ఉన్నా" అని పేర్కొన్నారు.

(చదవండి: బూస్టర్‌ డోస్‌ తీసుకున్న బైడెన్‌)

మరిన్ని వార్తలు