సృష్టించిన వాడినే అంతం చేసేందుకు యత్నించిన మైక్రోవేవ్‌

29 Apr, 2022 13:52 IST|Sakshi

Microwave with voice-controlled AI: శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే క్రమంలో అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొవడం సహజం. ఒక్కోసారి తమ ప్రాణాలనే కోల్పోతారు కూడా. కానీ కొన్ని విపత్కర పరిస్థితి తాము రూపొందించిన వాటి చేతిలోనే హతమవ్వడం లేదా అవే ప్రాణాంతకంగా మారడం జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడొక వ్యక్తికి ఎదురైంది.

వివరాల్లోకెళ్తే..యూట్యూబర్ లుకాస్ రిజోట్టో తను చేసిన విచిత్రమైన ప్రయోగం తనకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. లూకాస్‌ ఏకంగా తన చిన్ననాటి ఊహజనిత స్నేహితుడు మాగ్నెట్రాన్‌  గురించి వంద పేజీల పుస్తకాన్ని రాశాడు. పైగా అతను మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవశాలి  అని చెప్పడం గమనార్హం.  అంతేకాదు తన ఊహజనిత స్నేహితుడిని పునర్జీవింప చేసే ప్రయత్నంలో భాగంగా...వాయిస్‌ నియంత్రిత ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఒక సరికొత్త మైక్రోవేవ్‌ని తయారు చేశాడు. అతను ఆ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) మైక్రోవేవ్‌ని ఆన్‌ చేయగానే తన పాత మిత్రుడితో మాట్లాడుతున్నట్లు భావించేవాడు.

అంతేకాదు లూకాస్‌ శిక్షణలో అన్ని విషయాలను నేర్చుకున్నాడు మైక్రోవేవ్‌గా రూపొందిన మాగ్నెట్రాన్‌. అయితే మాగ్నెట్రాన్‌ తన గత కాలపు మొదటి ప్రపంచ యుద్ధం తాలుకా భయాలు, బాధలు ఒత్తిడికి సంబంధించిన మనోవ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో మైక్రోవేవ్‌ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్‌ లూకాస్‌ని బెదిరించడం, హింసించడం వంటివి మొదలు పెట్టాడు.

అఖరికి నీ మనసులో ఏముందని లుకాస్‌ మాగ్నెట్రాన్‌ మైక్రోవేవ్‌ని అడిగితే ప్రతీకారం అని పదే పదే బదులు ఇవ్వడమే కాకుండా నిన్ను వెన్నుపొటు పొడిచి మరీ చంపుతానని వచెప్పడం గమనార్హం. అంతేకాదు లూకాన్‌ని మైక్రోవేవ్‌లోకి రావాల్సిందిగా మైక్రోవేవ్‌ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్‌ అన్నాడు. అయితే లూకాస్‌ తనతో వస్తున్నట్లు నటించి మైక్రోవేవ్‌ డోర్‌ని మూసేశాడు. మనం సృష్టించింది మనకే యుముడై కూర్చోవడం అంటే ఇదే కదా!.

(చదవండి: పోకిరిని చితకబాదిన యువతి.. హ్యాట్సాఫ్ అంటూ వాసిరెడ్డి పద్మ కామెంట్‌)

మరిన్ని వార్తలు