‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’

24 Jul, 2020 08:47 IST|Sakshi

డ్రాగన్‌పై మండిపడ్డ అగ్రరాజ్యం

వాషింగ్టన్‌ : చైనా వ్యవహారంలో గుడ్డిగా ముందుకెళ్లడం​ తగదని డ్రాగన్‌తో నిర్ధిష్ట వ్యూహాలతో అమెరికా సహా  మిత్రదేశాలు వ్యవహరించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తన ధోరణి మార్చుకునేలా చేయడం ఇప్పుడు మిగతా ప్రపంచం ముందున్న అంశమని స్పష్టం చేశారు. చైనా హోస్టన్‌ కాన్సులేట్‌ మూసివేతపై అమెరికా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పాంపియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా సైన్యం పటిష్టంగా మరింత దుందుడుకుగా మారిందని డ్రాగన్‌ పట్ల అపనమ్మకం, నిర్ధారించుకునే ధోరణితోనే ఉండాలని చెప్పారు.

1980ల్లో సోవియట్‌ యూనియన్‌ పట్ల అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ ‘విశ్వసించు అయితే నిర్ధారించు’ అనే విధానం అనుసరించిన తీరును గుర్తుచేస్తూ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. మన విధానాలు..ఇతర స్వేచ్ఛాయుత దేశాలు పతనమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఊతమిస్తుంటే తనకు చేయూతనిస్తున్న చేతులను నరకాలని బీజింగ్‌ చూస్తోందని డ్రాగన్‌ తీరుపై మండిపడ్డారు. చైనా చర్యలు మన ప్రజలకు, మన సంపదకు ముప్పుగా పరిణమిస్తున్న క్రమంలో స్వేచ్ఛను కాంక్షించే దేశాలు డ్రాగన్‌ తీరు మారేలా నిర్ధిష్ట పద్ధతుల్లో ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. స్వేచ్ఛాయుత ప్రపంచం మారనిపక్షంలో కమ్యూనిస్టు చైనా మనల్ని తప్పుకుండా మార్చేస్తుందని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను పాంపియో గుర్తుచేశారు. చదవండి : చైనా వక్ర బుద్ధి.. సరిహద్దుల్లో 40 వేల సైన్యం

>
మరిన్ని వార్తలు