చైనాపై మరోసారి అమెరికా మండిపాటు

20 Dec, 2020 04:20 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. వూహాన్‌లో వైరస్‌ జాడను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేపట్టిన విచారణకు కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ‘చైనా తయారు చేస్తున్న వివిధ టీకాల సమర్థత కు సంబంధించి డేటాను బహిర్గతం చేయడం లేదు. క్లినికల్‌ ట్రయల్స్‌లో పారదర్శకత, ప్రమాణాలు పాటించడం లేదు. ఇటువంటి చర్యలతో చైనా పౌరులతోపాటు ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’అని విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. లక్షలాది మరణాలకు, కోట్లాదిగా ప్రజల జీవనోపాధి దెబ్బతినేందుకు కారణమైన కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై పారదర్శకంగా వ్యవహరించేలా చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు