22 మంది సజీవసమాధి

9 Sep, 2020 10:19 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ప్రఖ్యాతిగాంచిన జియారత్‌ ఘర్‌ పర్వతప్రాంత పాలరాయి గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గని కార్మికుల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పర్వతపాదం సమీపంలోని సఫీ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పాలరాయి గనిలోని ఆరు యూనిట్లు కుప్పకూలడంతో 12 మంది కార్మికులు ఘటనాస్థలిలో మరణించారు. కూలిన గని శిథిలాల కింద దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండే అవకాశముందని పోలీసు అధికారి తారిఖ్‌ హబీబ్‌ చెప్పారు. ప్రమాదం జరిగే సమయానికి అక్కడ దాదాపు 45 మంది కార్మికులు పనిచేస్తున్నారని డిప్యూటీ కమిషనర్‌ ఇఫ్తికార్‌ చెప్పారు. ఘటనాస్థలిలో తొమ్మిది మందిని కాపాడారు.

చదవండి: పాక్‌ చెరలో 19మంది భారతీయులు

మరిన్ని వార్తలు