తప్పు జరిగిపోయింది.. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ క్షమాపణలు

18 Oct, 2022 11:40 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌.. జాతిని ఉద్దేశించి క్షమాపణలు తెలియజేశారు. మినీ బడ్జెట్‌.. పన్నుల కోత నిర్ణయాలు బెడిసి కొట్టడం వెనుక పెద్ద తప్పు జరిగిపోయిందని, ఆ తప్పు చాలా దూరం వెళ్లిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 

సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘జరిగిన పొరపాట్లకు క్షమించండి. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆ పరిణామాలు చాలా వేగంగా.. చాలా దూరం వెళ్లాయి. అందుకు బాధ్యత నేనే తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతాం’’ అని ఆమె పౌరులను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. 

అయితే.. తప్పులు జరిగినప్పటికీ దేశం కోసం పని చేయడానికే తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్జర్వేటివ్‌ తరపున తన సారథ్యంలోని ప్రభుత్వమే ఎన్నికలకు వెళ్తుందని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే..  ట్రస్‌ను ఎన్నుకుని తప్పిదం చేశామన్న అభిప్రాయంలో ఉన్న కొందరు కన్జర్వేటివ్‌ ఎంపీలు.. అవిశ్వాసం ద్వారా ఆమెను గద్దె దించే ఆలోచనలో ఉన్నట్లు అక్కడి మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. 

ఇదీ చదవండి: అవిశ్వాసం.. లిజ్‌ ట్రస్‌కు ఉన్న ఏకైక ఆయుధం అదే!

మరిన్ని వార్తలు